బైక్‌ కొనేందుకు డబ్బులివ్వలేదని.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌ కొనేందుకు డబ్బులివ్వలేదని..

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

యువకుడి ఆత్మహత్య

దుబ్బాకటౌన్‌: బైక్‌ను కొనుగోలు చేసిన తరువాత తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని యువకుడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాయపోల్‌ మండలం రామారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కే.మానస కథనం ప్రకారం... చిన్న మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన గూని కిరణ్‌ కుమార్‌ (22) డ్రైవర్‌గా పని పనిచేస్తున్నాడు. వారం రోజుల నుంచి రామారంలోని అక్క బావ వద్ద ఉంటూ తన అశోక్‌ లేలాండ్‌ వాహనం నడిపాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గజ్వేల్‌కు వెళ్లి వస్తానని అక్కకు చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం నిన్నటి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం వెతికారు. బుధవారం ఉదయం కిరణ్‌ కుమార్‌ బావ వ్యవసాయ పొలంలో ఉరివేసుకున్నాడు. కాగా కొన్ని రోజుల క్రితం కిరణ్‌ కుమార్‌ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. దానికోసం రూ.45 వేలు ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగితే కొన్ని రోజుల తర్వాత ఇస్తామన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఎల్లం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement