జోగిపేట(అందోల్): పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు పంపిణీ చేసినట్లు అందోలు ఎంఈఓ బండి కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం నరేష్ కుమార్, ఉపాధ్యాయులు మాణయ్య, మంజ్యా నాయక్, రాములు, త్రినాధ్ రావు, అనిల్ కుమార్, నరోత్తం కుమార్, లక్ష్మణ్, సీహెచ్ చంద్రశేఖర్, రజినీ కాంత్, వీబీ శ్రీనివాస్, రవికుమార్, వెంకటేశం, చంద్రశేఖర్, మజీద్ పాల్గొన్నారు.
వైభవంగా లక్ష్మీ సుదర్శన యాగం
నారాయణఖేడ్: ప్రేమ, భక్తితోనే మాన జీవితానికి మోక్షం లభిస్తుందని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాదవానంద సరస్వతీస్వామి తెలిపారు. పట్టణంలోని మహతి జ్యోతిష్యాలయంలో సోమవారం నిర్వహించిన లక్ష్మీ సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సంజీవరెడ్డి హాజరై మాట్లాడారు. యాగం ద్వారా దేశం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఎమ్మెల్యే, అనుపమారెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శి వినోద్ పాటిల్, మహతి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు గురురాజ్‌శర్మ పాల్గొన్నారు.
ముమ్మరంగా
పూడికతీత పనులు
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని ప్రధాన మురుగు కాల్వల్లో పూడికతీత పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. వరద ముంపు నివారణతో పాటు దోమలు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా చర్యగా జేసీబీలతో పనులు చేపడుతున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ సోమవారం పనులను పర్యవేక్షించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
భగవద్గీతపై ప్రచారం
జిన్నారం (పటాన్‌చెరు): మండలంలోని జంగంపేట, లక్ష్మీపతిగూడెంలలో సోమవారం త్రైత సిద్ధాంత భగవద్గీతతో పాటు అనుబంధ గ్రంథాల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి, ఇందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ గిరి, ఎన్‌ఎస్ కుమార్, మధు, నరసింహాచారి, నర్సింహరావు, శ్రీనివాస్ చారి, శ్రీనివాస్ శ్రేష్టి, జస్విత్, అంజి, ప్రదం, సైదులు, మహేశ్, గోపాల్ పాల్గొన్నారు.


