బురదయాతన..! | - | Sakshi
Sakshi News home page

బురదయాతన..!

Jun 16 2026 7:25 AM | Updated on Jun 16 2026 7:25 AM

చెరువులను తలపిస్తున్న రహదారి గుంతలు

ప్రయాణికులకు తప్పని తిప్పలు

కంది (సంగారెడ్డి): మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన పైప్‌లైన్‌ రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. కొంతకాలంగా ఈ రహదారికి మరమ్మతులు చేపట్టకపోవడంతో కంకర తేలి, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అంతేకాదు, ఇటీవల కురిసిన వర్షాలకు ఈ గుంతలన్నీ నీటితో నిండిపోవడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుమారు 38 ఏళ్ల క్రితం మంజీరా పైపులైను వెంట ఈ రహదారిని ఏర్పాటు చేశారు. అప్పట్లో వేసిన ఈ రోడ్డు ప్రస్తుతం సంరక్షణ కరువై పూర్తిగా పాడైపోయింది. ఈ రహదారి వెంట నిత్యం కోతలాపూర్‌, మక్తఆల్లూర్‌, కలివేముల, చెర్లగూడెం, జుల్కల్‌, ఎద్దుమైలారం తదితర గ్రామాల ప్రజలు తమ నిత్య అవసరాల కోసం, ఉద్యోగాల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే, చుట్టుపక్కల ఉండే పొలాలకు వెళ్లే రైతులు కూడా నిత్యం ఈ రహదారి వెంటనే ప్రయాణించాల్సి వస్తోంది.

కష్టాల్లో వాహనదారులు, రైతులు:

రహదారిపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. బురద రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నడపడం అత్యంత కష్టంగా మారిందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ దారిలోనే ప్రయాణించే రైతులు సైతం తమ వ్యవసాయ సామగ్రిని, పంటలను తరలించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పైప్‌లైన్‌ రోడ్డును పాలకులతో పాటు అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement