బైక్‌ ఢీకొని కార్మికుడికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని కార్మికుడికి తీవ్ర గాయాలు

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

హత్నూర(సంగారెడ్డి): నడుచుకుంటూ వస్తున్న కార్మికుడిని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని సంగారెడ్డి దౌల్తాబాద్‌ ప్రధాన రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన ఠాగూర్‌ గుండ్ల మాచునూరు గ్రామ శివారులోని కోవలెంట్‌ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. పరిశ్రమ నుంచి అద్దె గదికి వెళ్తున్న క్రమంలో కొండాపూర్‌కు చెందిన శివ, ప్రసాద్‌ ఇద్దరు బైకుపై ఏడుపాయల ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఠాగూర్‌ను ఢీకొట్టారు. దీంతో కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో పాటు కాలు విరిగింది. తోటి కార్మికులు గమనించి వెంటనే బైక్‌తో పాటు ఇద్దరు యువకులను తీవ్రంగా మందలించారు. అంబులెన్స్‌లో గాయపడిన కార్మికుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సైతం పరిశీలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement