రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాలి

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాలి ● ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ● పోలీసు అధికారుల పిల్లలతో భేటీ

● ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ● పోలీసు అధికారుల పిల్లలతో భేటీ

సంగారెడ్డి జోన్‌: పోలీసు అధికారుల పిల్లలు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందాలని ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ అన్నారు. స్పార్క్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం తన కార్యాలయంలో పోలీసు కుటుంబాల పిల్లలతో సమావేశమయ్యారు. ఐఐటీ అడ్వానన్స్‌లో ర్యాంక్‌ సాధించిన వినయ్‌ నాయక్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న సమయంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురికావద్దని సూచించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం నుంచే క్రమ పద్ధతిలో విద్యను అభ్యసించాలన్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అభిజ్ఞ, ప్రకతి వర్మ, సాయి శ్రీహిత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement