జిల్లాలోని పలు గ్రామాల వ్యవసాయ పొలాల వద్ద బోర్లకు విద్యుత్ అందించే ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు ఏపుగా పెరిగాయి. వర్షాలు ప్రారంభం కావటంతో ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉంది. విద్యుత్‌షాక్‌తో మనుషులు, జంతువులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని రైతులు కోరుతున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి


