తూప్రాన్/చేగుంట: ప్రమాదవశాత్తు నడుస్తున రైలు నుంచి యువకుడు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన డివిజన్ పరిధిలోని స్టేషన్‌మాసాయిపేటలోని రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్‌ఐ లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇస్లాంపూర్‌కు చెందిన దుందిగల్ల నిరంజన్‌దాస్(36)గా మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం స్టేషన్ మాసాయిపేటలో రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చక్రాల కింద పడి నలిగిపోయాడు. దీంతో శరీరం ఛిద్రమైంది. విషయం తెలిసిన రైల్వే పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య కల్యాణి, ఇద్దరు కొడుకులు లోకేష్ నితిన్ ఉన్నారు. దీంతో కుటుంబంలో విషాదం ఆలుముకుంది.


