ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం

Jan 18 2026 9:10 AM | Updated on Jan 18 2026 9:10 AM

ఆర్టీ

ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం

చేగుంట(తూప్రాన్‌): ఆర్టీసీ కార్గో ద్వారా సమ్మక్కసారక్క ప్రసాదం అందజేస్తున్నట్లు కార్గో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ వాత్స్య పేర్కొన్నారు. శనివారం చేగుంట ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ కార్గో ద్వారా దేవతల ప్రసాదం, ఫొటోలు, పసుపుకుంకుమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం భక్తులు దగ్గరలోని ఆర్టీసీ కార్గో కార్యాలయం లేదా టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్‌ వెబ్‌సైట్‌లో రూ.299 చెల్లించి బుక్‌ చేసుకోవాలని సూచించారు.

నేత్ర పర్వం..

రథోత్సవ వేడుకలు

తూప్రాన్‌: మండలంలోని ఇస్లాంపూర్‌ శ్రీరామలింగేశ్వరస్వామి జాతర మహోత్సవంలో భా గంగా శనివారం రథోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక రథంపై స్వామివారిని ఊరేగించారు. ఈ వేడుకల్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రథోత్సవ వేడుకల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ పూజారి శాలక ఆత్రేయశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. వేడుకల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నర్సాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, ఆయా పార్టీలకు చెందిన నాయకులు,భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

లేబర్‌ కోడ్‌ను రద్దు చేయాలి

నారాయణఖేడ్‌: కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను, వీవీ రాంజీ చట్టం, జాతీయ విత్తన, విద్యుత్తు సవరణ బిల్లులను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం డిమాండ్‌ చేశారు. ఆయా డిమాండ్లతో సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాత శనివారం ఖేడ్‌కు చేరింది. రాజీవ్‌ చౌక్‌ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆయా చట్టాలు, బిల్లుల వల్ల రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆయా డిమాండ్లతో ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా సంఘాల బాధ్యులు సాయిలు, నర్సింహులు, యాదగిరి, రమేశ్‌, మహిపాల్‌, అరుణ్‌, చంద్రకళ, సాయ మ్మ, సిద్దమ్మ, బాలప్ప, ఏసు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత

మెదక్‌ కలెక్టరేట్‌: పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం స్వచ్ఛభారత్‌ యాత్రలో భాగంగా క్లీనప్‌ డ్రైవ్‌పై కలెక్టరేట్‌లోని అధికారులకు, పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నడుస్తున్న స్వచ్ఛ భారత్‌ యాత్ర ప్లాస్ట్‌ ఇండియా, ప్రపంచంలోకెల్లా ప్లాస్టిక్‌ ఎగ్జిబిషన్‌కు సంబంధించి వాహనమని తెలిపారు. ఈ వాహనం ద్వారా ప్రతి జిల్లాకు స్వచ్ఛభారత్‌ సిబ్బంది 41 కిలోమీటర్ల ప్రతిరోజు కాలినడకన వెళ్తూ ప్లాస్టిక్‌ కలెక్ట్‌ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, అధికారులు, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం1
1/2

ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం

ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం2
2/2

ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం ప్రసాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement