తక్కువ బడ్జెట్‌లో..
పుట్టినరోజు సందర్భంగా మా కుటుంబ సభ్యులు సర్‌ప్రైజ్ పార్టీని ఏర్పాటు చేశారు. తక్కువ బడ్జెట్‌లో పిల్లలు, పెద్దవాళ్లతో కలిసి సమయం కేటాయించడం ఆనందంగా ఉంది. మినీ ప్రైవేట్ థియేటర్‌లో పిల్లలకు కావలసిన వస్తువులు, గేమింగ్ జోన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం.
–శృతిలయ, గృహిణి, సంగారెడ్డి
ఆనందంగా గడిపాం
మినీ ప్రైవేట్ థియేటర్‌లో మేము కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాం. మ్యారేజ్ డే జరుపుకొని కొద్దిసేపు ముచ్చటించాం. ఇవి సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.
– సందీప్ గౌడ్, సంగారెడ్డి
ప్రస్తుతం మంచి డిమాండ్
సంగారెడ్డిలో 18 నెలల క్రితం మినీ ప్రైవేట్ థియేటర్‌ను మొదటిసారి ప్రారంభించాను. మొదట్లో తక్కువగా ప్రజలు వచ్చారు. ప్రసుత్తం మార్కెట్‌ల్లో మంచి డిమాండ్ ఉంది. కేటాయించిన సమయాన్ని బట్టి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. రెండు వేల నుంచి మొదలుకొని పదిహేను వేల వరకు ఖర్చు అవుతుంది. 30 నుంచి 50 మంది వరకు పార్టీ లు చేసుకోవచ్చు.
– కటకం సుమంత్, నిర్వాహకుడు,
మినీ ప్రైవేట్ థియేటర్
తక్కువ బడ్జెట్‌లో..
తక్కువ బడ్జెట్‌లో..


