పేకాట స్థావరంపై దాడి
● 9 మందిపై కేసు ● రూ.29,390 నగదు స్వాధీనం
పటాన్‌చెరు టౌన్: పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వినాయక్ రెడ్డి, క్రైమ్ సీఐ రాజు వివరాల ప్రకారం...శనివారం రాత్రి ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని త్రిశూల్ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు దాడులు చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.29,390 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్సైలు మహేశ్వర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


