
నేడు డయల్ యువర్ డీఎం
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని గురువారం చేపడుతున్నామని డిపో మేనేజర్ ఉపేందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రయాణికుల సమస్యలు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి 8500376267 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నేడు జాబ్ మేళా
సంగారెడ్డి టౌన్: జిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి అనిల్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ముత్తూట్ ఫైనాన్స్‌లో 60 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వ్యక్తిగత పరిశుభ్రత
పాటించాలి: అంజిరెడ్డి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి సూచించారు. రామచంద్రాపురం పట్టణంలోని సాయినగర్‌కాలనీలో జాతీయ పైలేరియా, నులిపురుగుల నిర్మూలనపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు నులిపురుగుల, పైలేరియా నిర్మూలనకు ఎంతో కృషి చేస్తుందని వివరించారు. ప్రతీ ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోపాటు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం నులిపురుగల నివారణకు ఉచిత మందులను పంపిణీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు సి.గోదావరి, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లో
నాణ్యమైన విద్య
కాంగ్రెస్ మహిళా నాయకురాలు అస్మా
న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రభుత్వ బడుల్లో వసతులతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అస్మా స్పష్టం చేశారు. మండల కేంద్రమైన న్యాల్‌కల్‌లోని కేజీబీవీని బుధవారం ఆమె సందర్శించారు. విద్యాలయంలో వంట గది, తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో అధిక శాతం పేద విద్యార్థులే చదువుతున్నారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యాలయంలో నెలకొన్న సమస్యలను ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆమె తెలిపారు.
జాతీయ పక్షి నెమలి మృతి
హత్నూర(సంగారెడ్డి): అనుమానాస్పద స్థితిలో జాతీయ పక్షి మృతి చెందిన ఘటన హత్నూర మండలం సిరిపుర ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు విద్యార్థులు తెలిపిన కథనం ప్రకారం బుధవారం ఉదయం విద్యార్థులు పాఠశాలకు వెళ్లిన సమయంలో పాఠశాల ఆవరణలో నెమలి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. వెంటనే గ్రామపంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మృతి చెందిన నెమలిని సిబ్బంది తీసుకెళ్లి ఖననం చేసినట్లు తెలిపారు.

నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం