
మీనాక్షి పర్యటనను జయప్రదం చేయాలి
జోగిపేట (అందోల్)/సంగారెడ్డి: అందోల్ నియోజకవర్గంలో ఆగస్టు 1న ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ పర్యటనలో భాగంగా చేపట్టనున్న పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న కార్యకర్తలకు అవసరమైన ఏర్పాట్లను మంత్రి బుధవారం పరిశీలించారు. అందోల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆగస్టు 2న అందోల్ పట్టణంలో నిర్వహించే శ్రమదాన కార్యక్రమం, కార్యకర్తలతో ముఖాముఖీ సమావేశం ఏర్పాట్లపై ముఖ్య నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, మాజీ కౌన్సిలర్లు ఎస్.సురేందర్‌గౌడ్, ఆకుల చిట్టిబాబు, పి. ప్రవీణ్, డి.శంకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో
మంత్రి దామోదర