
ఫేస్‌రికగ్నేషన్‌తో అక్రమాలకు అడ్డు
సంగారెడ్డి టౌన్: ఫేస్ రికగ్నేషన్ (ముఖ గుర్తింపు) ద్వారా పింఛన్లు ఇవ్వడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి వార్డు కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రభుత్వ చేయూత పెన్షన్లను ముఖ గుర్తింపు ప్రత్యేక యాప్ ద్వారా అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ముఖ గుర్తింపు యాప్‌తో పెన్షన్లు ఇవ్వడం వల్ల వృద్ధులు వేలిముద్రలు రాని వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రతీ నెలా పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ ద్వారా నూతనంగా ప్రభుత్వం రూపొందించిన ముఖ గుర్తింపు ప్రత్యేక యాప్ ద్వారా పెన్షన్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పింఛన్ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంపిణీ తీరును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ద్వారా పింఛన్ లబ్ధిదారులకు నిత్య అవసరాలకు నిధులు సకాలంలో అందేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అధిక ధరలకు వినియోగిస్తే చర్యలు
సంగారెడ్డి జోన్: ఎరువులు అధిక ధరలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు. పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాన్ని బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణంలో యూరియా స్టాక్‌ను పరిశీలించారు. ఎవరైనా కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు.
రైతుతో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్
తనిఖీ సమయంలో కలెక్టర్ దుకాణంలో ఎరువులు కొనుగోలు చేసిన రైతుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎరువులను ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మారని తెలుసుకున్నారు. అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్‌కు ఆదేశించారు.
కలెక్టర్ ప్రావీణ్య వెల్లడి