
డెక్కన్ టోల్ వేస్‌కు గ్రీన్ హైవేస్–2023 అవార్డు
జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దు నుంచి సంగారెడ్డి వరకు 65వ జాతీయ రహదారిని ఉత్తమంగా నిర్వహిస్తున్నందుకుగాను సంగారెడ్డికి చెందిన డెక్కన్ టోల్ వేస్ సంస్థకు గ్రీన్ హైవేస్–2023 కేటగిరీలో రజత పురస్కారం లభించింది. మంగళవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో డెక్కన్ టోల్ వేస్‌కు చెందిన ప్రాజెక్టు హెడ్ రాజేశ్ విచారెకు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి అవార్డును ప్రదానం చేశారు. జాతీయ రహదారి పొడుగునా పచ్చదనం నింపడం, పునరుత్పాదక ఇంధన సృష్టి, నీటి సేకరణ, వినూత్న మొక్కలు నాటడం, నీటి నిర్వహణ పద్ధతులపై చేస్తున్న కృషికిగాను డెక్కన్ టోల్ వేస్ సంస్థకు అవార్డు లభించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.