
నా సినిమాలో నిరసన సన్నివేశాలు
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తాను తీస్తున్న సినిమాలో ఒక కలెక్టర్‌కు వ్యతిరేకంగా తాను చేసిన ధర్నాలు, రాస్తారోకోలు.. కలెక్టర్ బదిలీ అయ్యే వరకు చేసిన నిరసనలకు సంబందించిన సన్నివేశాలు ఉంటాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడి యాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సినిమాలో తన ప్రేమ కథ ఉండదని, ప్రేమ జంటకు అండగా నిలిచే పాత్రలో తాను నటిస్తున్నానని చెప్పారు. గతంలో తనపై పోలీసులు చేసిన ఒత్తిడిలు, నిర్బంధాలు, ఎస్పీతో జరిగిన వాగ్వాదాలు కూడా ఉంటాయని ఆయన వివరించారు.
ట్యాంకర్‌ల ద్వారా
నీటి సరఫరా
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో నీటి సమస్య నెలకుంది. మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించడంలేదని వారు సమ్మెకు దిగారు. పట్టణంలో నీటి సరఫరా ఆగిపోవడంతో ప్రజలు బిందెడు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని పలు కాలనీలో బోరుమోటారు లేవు. కేవలం మిషన్‌భగీరథ నీటిపైనే ప్రజలు ఆధారపడి ఉన్నారు. తాడగానికి వాటర్ క్యాన్‌లు కొనుగోలు చేస్తుండగా.. ఇంటి అవసరాల నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా సమస్య పరిష్కారం కోసం సోమవారం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.
అవగాహనతో
అగ్ని ప్రమాదాలకు చెక్
న్యాయమూర్తి భవానీ చంద్ర
సంగారెడ్డి క్రైమ్: అవగాహన ఉంటే అగ్ని ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చని జిల్లా న్యాయమూర్తి భవానీ చంద్ర అన్నారు. సంగారెడ్డిలో అగ్నిమాపక దళ వారోత్సవాలను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. ప్రజలకు ప్రమాదాలు నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా వారోత్సవాలు నిర్వహించినట్లు పట్టణ అగ్నిమాపక కేంద్రం ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తొలుత 1944లో ముంబై డాక్యార్డ్స్‌లో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం అగ్నిమాపక అధికారులతో కలిసి వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
‘రన్ ఫర్ ’ అంబేడ్కర్
సంగారెడ్డి జోన్: బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలో రన్ ఫర్ అంబేడ్కర్ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఉదయం ఐబీ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించగా జిల్లా అదనపు ఎస్పీ సంజీవ్ రావు ‘రన్ ఫర్’ను జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొండాపురం జగన్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.

నా సినిమాలో నిరసన సన్నివేశాలు

నా సినిమాలో నిరసన సన్నివేశాలు

నా సినిమాలో నిరసన సన్నివేశాలు