
మహోన్నత వ్యక్తి అంబేడ్కర్
● ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
● రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు
సంగారెడ్డి జోన్: సామాజిక వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి, ఎస్సీ ఈడీ కార్పొరేషన్ అధికారి రామాచారి, బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్, జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజలందరికి సమాన హక్కులు కల్పించారు: ఎమ్మెల్యే హరీశ్‌రావు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): చీకట్లో ఉన్న వారికి వెలుగును చూసిన మహానీయుడు అంబేడ్కర్ అని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, సీనియర్ నాయకులు సోమిరెడ్డి, రమేష్, నర్సింహ పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆశయ సాధనకు పాటుపడుదాం: ఎంపీ షెట్కార్, ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్: బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అన్నారు. సోమవారం జహీరాబాద్‌లో అంబేడ్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. అనంతరం హోతి(బి)లో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బి,నర్సయ్య, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, ఎంపీ కార్యాలయ పార్లమెంట్ ఇంచార్జి జి.శుక్లవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

మహోన్నత వ్యక్తి అంబేడ్కర్

మహోన్నత వ్యక్తి అంబేడ్కర్