
మంటలంటుకొని వరి చేను దగ్ధం
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ఆదివారం ప్రమాదవ శాత్తు వరి చేనుకు మంటలంటుకొని దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన కళవ్వ రెండెకరాల వరి సాగు చేస్తోంది. నీటి కొరత ఏర్పడగా రూ.20 వేలు ఖర్చు చేసి బావి పూడిక తీయించి వరుసతడులు పెడుతూ పంటను కాపాడుకుంటోంది. బావి దగ్గర విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ఎండల వేడికి ఫీజు వైర్ దగ్గర మంటలు వచ్చి వరి చేనులోకి వ్యా పించాయి. సమీప రైతులు చూసి మంటలు ఆర్పుతూ బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. వెంటనే కళవ్వ కుటుంబ సభ్యు లు అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఇటు పంట, బావిలో విద్యుత్ మోటరు, పైపులు కాలిపోయి రూ.60 వేల నష్టం జరిగిందని బాధితులు వాపో యారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే వరి పంట కాలిపోయిందని, ప్రభుత్వం, అధికారులు స్పందించి పరిహారం అందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.
ఫొటో స్టూడియోలో చోరీ
కంప్యూటర్ ధ్వంసం
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలోని ఓ ఫొటో స్టూడియోలో దొంగతనం జరిగింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... కుకునూరుపల్లిలోని మారుతిసాయి డిజిటల్ ఫొటో స్టూడియో యజమాని శనివారం రాత్రి వరకు పనులు చేసి బంద్ చేసి వెళ్లారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు స్టూడియో తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి డబ్బులు, విలువైన వస్తువులు ఉన్నాయా అని వెతికారు. ఏమి దొరక్కపోవడంతో ఫొటోలను డిజిటల్ చేసే కంప్యూటర్‌ను ధ్వంసం చేసి వెళ్లారు. దీని విలువ సుమారు రూ. 20 వేల వరకు ఉంటుంది. వీటితో పాటు కొన్ని దేశాల నాణేలను జమచేసి స్టూడియోలో పెట్టగా వాటిని ఎత్తుకెళ్లారు. యజమాని ఉప్పల రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దాడికి పాల్పడిన వ్యక్తులపై
కేసు నమోదు
శివ్వంపేట(నర్సాపూర్): భూమి విషయంలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథనం ప్రకారం... మల్లుపల్లి గ్రామానికి చెందిన గ్యాదరి శ్రీనివాస్‌కు సంబంధించిన భూమి విషయంలో అతడిపై పలువురు వ్యక్తులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ప్రవీణ్, మహేష్, నెల్లూరు, మల్లేష్, భిక్షపతి, సాయిలు, ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన కార్మికుడి మృతి
పటాన్‌చెరు టౌన్: పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బీడీఎల్ సీఐ స్వామి గౌడ్ కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర (32) మండలంలోని ఇస్నాపూర్‌లో నివాసం ఉంటూ కిర్బీ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 5వ తేదీన విధి నిర్వహణలో ఉండగా పెయింటింగ్ మిషన్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిశ్రమ యాజమాన్యం అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మంటలంటుకొని వరి చేను దగ్ధం