
ఇంటికి ఇద్దరేసి కవులను కన్న తెలంగాణ
కావ్యగాన సభలో కవి అందెశ్రీ
సిద్దిపేటజోన్: ఇంటికి ఇద్దరేసి కవులను కన్న తెలంగాణ గడ్డ మీద పుట్టడం ఎంతో అదృష్టమని రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అన్నారు. శనివారం రాత్రి స్థానిక విపంచి ఆడిటోరియంలో జాతీయ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ శ్రీ శూద్ర గంగ కావ్యగానం చేశారు. ఈ సందర్భంగా అందెశ్రీ మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రాంతంతో తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచే తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. మంజీర రచయిత సంఘంలో సిద్దిపేట కీలకమైన పాత్ర పోషించిందని చెప్పారు. శ్రీ శూద్ర గంగ కావ్య గానం చేసిన సుద్దాల అశోక్ తేజ తన అనుభవాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదాల కింద ఉండే వారు శూద్రులు అయినప్పుడు పాదాల కింద నుంచి వచ్చే గంగ శూద్ర గంగ ఎందుకు కాదనీ దాని నుంచే పుస్తకం పుట్టిందన్నారు కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షుడు పరమేశ్వర్, జిల్లా జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు రంగాచారి, విష్ణు ప్రసాద్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు వర్మ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
దత్తగిరిలో ఘనంగా
హనుమాన్ జయంతి
ఝరాసంగం(జహీరాబాద్): బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం జయంతిని పురస్కరించుకుని బర్దీపూర్‌తోపాటు వివిధ గ్రామాల్లో వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, డోలారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.