వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
నారాయణఖేడ్: హనుమాన్ జయంతి వేడుకలు నారాయణఖేడ్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయంలో డోలాహరణం, అభిషేకం, అలంకరణ, పూజ, మహాహారతి నిర్వహించారు. ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మశ్చందర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొని హనుమాన్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాంమహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. హనుమాన్ దీక్షాధారులు దీక్షల్ని విరమించారు. ఖేడ్ కల్పన హనుమాన్ ఆలయంలో సుప్రభాతసేవ, మాన్యసుక్తాభిషేకం, చందనం తదితర కార్యక్రమాలను నిర్వహించగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఖేడ్‌లో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో భారీ శోభాయాత్రను నిర్వహించారు.
రైతులకు అండగా
కాంగ్రెస్ ప్రభుత్వం
ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి
కల్హేర్(నారాయణఖేడ్): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. సిర్గాపూర్ మండలం కడ్పల్, నిజాంపేట్ మండలం నాగధర్‌లో శనివారం వరి ధాన్యం, జొన్న కోనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యం చివరి గింజ వరకు కోనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనీశ్‌పాటీల్, నాయకులు యాదవరెడ్డి, మల్దోడ్డి తుకారాం, పీఏసీఎస్ చైర్మన్లు సంగారెడ్డి, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
డంపింగ్‌యార్డ్ మాకొద్దు
67వ రోజుకు చేరిన నిరసనలు
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్‌యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు శనివారం నాటికి 67వ రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి, ప్యారానగర్, గుమ్మడిదల గ్రామాల్లో రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా కొసాగుతున్నాయి. మున్సిపాలిటీలోని దోమడుగు గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ...డంపింగ్‌యార్డ్ ఏర్పాటుతో ప్రజల ఆరోగ్యాలతోపాటు, పాడిపశువు, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ఏర్పాటును విరమించేవరకు నిరసనలు ఆపేదిలేదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
జహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ బాలుర మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2025–26 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలు అలాగే 6వ తరగతి(మైనార్టీ)లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ జే.రాములు ప్రకటనలతో తెలిపారు. 5వ తరగతిలో ముస్లిం మైనార్టీ సీట్లు 51, క్రిస్టియన్ 5, జైన్, పార్శీ, బౌద్దులు, సిక్కులకు 4, నాన్‌మైనార్టీ విద్యార్థులకు 20 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం కూడా దరఖాస్తులను ఆహ్వానిస్లున్నట్లు ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లో లేదా గురుకుల పాఠశాలలో ఏప్రిల్ 30 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు


