సమస్యల పరిష్కారానికే కంట్రోల్‌రూమ్‌ | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే కంట్రోల్‌రూమ్‌

Apr 11 2025 8:54 AM | Updated on Apr 11 2025 8:54 AM

సమస్యల పరిష్కారానికే కంట్రోల్‌రూమ్‌

సమస్యల పరిష్కారానికే కంట్రోల్‌రూమ్‌

సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు, ఎల్‌ఆర్‌ఎస్‌, రాజీవ్‌ యువ వికాసం పథకం, తాగునీటి ఎద్దడి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే గ్రీవెన్స్‌ సెల్‌ నంబర్‌ 08455 276155 నంబర్‌కు డయల్‌ చేసి సమస్యల పరిష్కరించుకోవాలని జిల్లా ప్రజలను గురువారం ఓ ప్రకటనలో కోరారు.

కలెక్టరేట్‌లో చలివేంద్రం ఏర్పాటు

కలెక్టరేట్‌కు వివిధ పనులపై వచ్చే ప్రజల దాహర్తి తీర్చేందుకు రెవెన్యూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అధికారులలతో కలసి కలెక్టర్‌ క్రాంతి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, మాధూరి, డీఆర్‌ఓ పద్మజరాణి, ట్రెసా అధ్యక్షుడు గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement