చిన్నప్పటి నుంచి క్రికెట్ ఇష్టం
చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. రోజంతా పనిలో ఉండి ఆడలేక పోయే వాళ్లం. మళ్లీ క్రికెట్ ఆడటం వీలు కాదనుకున్నా. కానీ సంగారెడ్డిలో బాక్స్ క్రికెట్ స్టేడియంలు ఏర్పాటు చేయడం సంతోషకరం. రాత్రి వేళలో బాక్స్ క్రికెట్ ఆడుతుంటాం. ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ఆటలు మానవ శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం, అందరూ సమయం దొరికినప్పుడు ఏదో ఒక ఆటని ఆడే అలవాటు చేసుకోవాలి.
– షాబుద్దీన్, క్రికెట్ క్రీడాకారుడు
సుమారు రూ.15 లక్షల ఖర్చు
బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు వచ్చింది. సాధారణ రోజుల కంటే వీకెండ్‌లలో ఎక్కువగా వస్తుంటారు. క్రికెట్‌తో పాటు బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్ బాల్ , స్నూక్కర్ ఆడుకోవడానికి సౌకర్యం ఉంది. దూర ప్రాంతాల నుంచి రాత్రి సమయాల్లో ఆటలు ఆడుతున్నారు. మంచి లాభాలు పొందుతున్నాం. – ఆసిఫ్, బాక్స్ క్రికెట్ నిర్వాహకుడు
చిన్నప్పటి నుంచి క్రికెట్ ఇష్టం


