రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మరో ఇద్దరికి గాయాలు
మునిపల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మండలంలోని బుదేరా చౌరస్తా 65వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేశ్ నాయక్ కథనం మేరకు.. గురువారం బుదేరా గ్రామానికి చెందిన వనంపల్లి రమేశ్ (30) అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఎక్సెల్ వాహనంపై టీ తాగడానికి వస్తున్నారు. ఇదే సమయంలో సంగారెడ్డి నుంచి అతివేగంగా వచ్చిన క్వాలీస్ వాహనం ఎక్సెల్‌ను, అనంతరం ఇద్దరు పాదాచారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


