షార్ట్ సర్క్యూట్‌తో వాహనాలు దగ్ధం
సిద్దిపేటఅర్బన్: ఓ ఇంటిలో జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో ఓ కారు సహా మూడు ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలోని మారుతీనగర్‌లో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ విద్యాసాగర్ తెలిపిన కథనం మేరకు.. సిద్దిపేట పట్ణంలోని మారుతీనగర్‌లో బెల్లంకొండ వెంకటేశ్వర్‌రావు ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో విద్యుత్ మీటర్ల వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి అర్థరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. కాసేపటికి మంటలను గుర్తించిన సురేశ్ అనే వ్యక్తి ఇంట్లోకి మంటలు వ్యాపిస్తున్నాయ నే ఆందోళనతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకగా స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం చుట్టుపక్కల వారి సాయంతో ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పివేయగా అప్పటికే వరండాలో పార్కింగ్ చేసిన కారు సహా మూడు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. వీటితో పాటు కింది పోర్షన్ డోర్లు, మూడు విద్యుత్ మీటర్లు, వైర్లు, బోర్ స్టార్టర్, డ్రైనేజీ పైపులు బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వెంకటేశ్వర్‌రావు వాపోయారు. కాగా విద్యుత్ మీటర్లలో తలెత్తిన సమస్య వల్లే షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ నర్సింహులు పేర్కొన్నారు. బాధితుడు వెంకటేశ్వర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. షార్ట్‌సర్క్యూట్‌కు గల కారణాలపై సీఐ విద్యాసాగర్ ఆరా తీశారు.
కారు, మూడు ద్విచక్రవాహనాలు కాలి బూడిద
రూ.15 లక్షల ఆస్తి నష్టం


