రంజాన్ వేడుకలకు సిద్ధం
సంగారెడ్డి జోన్/జహీరాబాద్ టౌన్: జిల్లాలో రంజాన్ పండుగ వేడుకలు జరుపుకునేందుకు సర్వం సిద్ధం అయింది. మండల కేంద్రాలతోపాటు వివిధ గ్రామాల్లో నేడు రంజాన్ పండుగ సంబరాలు జరుపుకోనున్నారు. పండుగను పురస్కరించుకుని గ్రామాల్లోని మసీదులు విద్యుద్దీపాల కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఉదయం 9 గంటల సమయంలో మత పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
జహీరాబాద్ ఈద్గా ముస్తాబు...
జిల్లాలో అతి పెద్దదైన జహీరాబాద్ ఈద్గా ప్రార్థనలకు ముస్తాబైంది. ఇక్కడ ఒకేసారి సుమారు 25 వేలమంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుంది. ఇప్పటికే ప్రార్థనల కోసం ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రంజాన్ పండుగ షాపింగ్ కోసం ప్రజలు మార్కెట్‌కు రావడంతో ఆదివారం పట్టణంలో సందడి కనిపించింది.
ఘనంగా ఉగాది వేడుకలు
ఝరాసంగం(జహీరాబాద్)/సంగారెడ్డి /రామచంద్రాపురం (పటాన్‌చెరు): తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మండల కేంద్రమైన ఝరాసంగంతోపాటు వివిధ గ్రామాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇండ్లల్లో ప్రత్యేక పూజలు పచ్చడి తయారు చేశారు. సాయంత్రం సమయాల్లో శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంతోపాటు దత్తగిరి ఆశ్రమంలో పంచాగ పఠనం చేశారు.
సంగారెడ్డిలో...
జిల్లా కేంద్రం సంగారెడ్డిలో కన్నుల పండువగా జరిగింది. జిల్లా కేంద్రం సంగారెడ్డితోపాటు జిల్లాలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద ఉన్న రామాలయంలో రాత్రి నిర్వహించిన మొరుండల కార్యక్రమం అందరినీ ఉత్సాహపరిచింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి రామాలయంపై నుంచి ప్యాలాలతో చేసిన మొరుండలను ప్రజల్లోకి విసరగా వాటిని అందుకోవడానికి జనం పోటీపడ్డారు.
రామచంద్రాపురంలో...
రామచంద్రాపురం,భారతీనగర్ డివిజన్, బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లో ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప లు ఆలయాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీలో శ్రీలత, స్వరూప ఆధ్వర్యంలో చేపట్టిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు రెడ్డి పాల్గొన్నారు.హనుమాన్ ఆలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేటితో ముగియనున్న
ఓటీఎస్ పథకం
జిన్నారం (పటాన్‌చెరు): ఈ నెల 31 తో ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకం ముగియనుందని బొల్లారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సైతం అధికారులు అందుబాటులో ఉండి పన్నులు వసూలు చేశారు. పారిశ్రామికవేత్తలు, గృహ యజమానులు ముందుకు వచ్చి 90% వడ్డీ రాయితీతో పనులు చెల్లించారు. మెడ్రిచ్ లిమిటెడ్ పరిశ్రమ రూ.5,93,280 , ఎస్డీ స్టీల్ ఇండస్ట్రీస్ రూ.1,82,002, విజేత ఎంటర్ర్‌పైజెస్ రూ.3,01,898 ఆస్తి పన్ను బకాయిలను చెక్కు రూపంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కలిసి అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ...ఇప్పటివరకు 13.75 కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేశామన్నారు.
రంజాన్ వేడుకలకు సిద్ధం
రంజాన్ వేడుకలకు సిద్ధం


