హత్నూర (సంగారెడ్డి): హత్నూర మండలం షేర్‌ఖాన్‌పల్లి గ్రామ శివారులోని అటవీప్రాంతంలో వెలసిన పలుగు మీది నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి ఆలయ ఈవో దేవదానం, పాలకమండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. మధ్యాహ్నం ఎల్లమ్మ కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడురోజులపాటు జరిగే జాతర ఉత్సవాలలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈవో తెలిపారు.
రైతు సమస్యల
పరిష్కారంలో విఫలం
రాష్ట్ర రైతు సంఘం నాయకుడు దశరథ్
సదాశివపేట(సంగారెడ్డి): రైతు సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు దశరథ్ విమర్శించారు. పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రైతు సంఘం జిల్లా మూడవ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వాలు మారుతున్న రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్వామినాథన్ కమిషన్ నివేదికను బీజేపీ ప్రభుత్వం పక్కనపట్టి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. భవిష్యత్తులో రైతుల సమస్యలపై కీలక పోరాటాలు చేయాలని మహాసభలో తీర్మానించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్వరూప, విష్ణువర్దన్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు మాణేయ్య తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యాన్నిపాటించాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు
సదాశివపేట(సంగారెడ్డి): దేశ ప్రజలందరూ మతసామరస్యంతో కలిసిమెలసి ఉండాలని భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య లౌకిక విలువలు ప్రతి ఒక్కరు కాపాడాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు పేర్కొన్నారు. శనివారం రాత్రి ఎంఆర్‌ఎఫ్ యూనియన్ మాజీ సంయుక్త కార్యదర్శి హాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఫ్తార్ విందుకు చుక్కా రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. కొన్ని శక్తులు దేశంలో ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, నాయకులు ప్రవీణ్‌కుమార్, నర్సింలు, ఎంఆర్‌ఎఫ్ కార్మికులు పాల్గొన్నారు.
ప్రారంభమైన నల్లపోచమ్మ ఉత్సవాలు
ప్రారంభమైన నల్లపోచమ్మ ఉత్సవాలు