బీర పంటతో అధిక లాభాలు
జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ
అక్కన్నపేట(హుస్నాబాద్): విత్తన ప్రక్రియ ఆరంభమైన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత అని జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో రైతు స్వామిరెడ్డి సాగు చేసిన బీర తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న కూరగాయల్లో బీర ఒకటి అన్నారు. అలాగే అధిక డిమాండ్ కల్గి ఉండి తొందరగా చేతికందు పంట బీర అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి కరంటోతు శ్రీలత పాల్గొన్నారు.
నిందితుడి రిమాండ్
ములుగు(గజ్వేల్): ములుగు మండలం బహి లంపూర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పెంటమీది స్వామిని శుక్రవారం అదుపులోకి తీసు కొని గజ్వేల్ కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. అత్యాచారా నికి గురైన బాలికకు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
సిద్దిపేటఅర్బన్: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం మేరకు.. వెల్కటూరు శివారులో కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాట వెలికట్టకు చెందిన పెరుగు కిష్టయ్య, పొన్నాలకు చెందిన లెంకల కనకయ్య, మర్పడగకు చెందిన వల్లపు కనకయ్య, దుద్దెడకు చెందిన మహ్మద్ నహీం పట్టుబడ్డారు. నాంచారుపల్లికి చెందిన రాము, వెల్కటూరుకు చెందిన కిషన్, సిద్దిపేటకు చెందిన చారి పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 9480 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
లారీలో బస్తాలను లోడ్ చేస్తూ..
ప్రమాదవశాత్తు కిందపడి హమాలీ మృతి
వర్గల్(గజ్వేల్): వడ్ల బస్తాలను లారీలో లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి హమాలీ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వర్గల్ మండలం శాకారంలో చోటు చేసుకుంది. గౌరా రం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి కథనం మేరకు.. ఒరిస్సా రాష్ట్రం పార్లకేముండి గ్రామానికి చెందిన బీరా ప్రకాశ్(43) ఉపాధి నిమిత్తం ఆరు నెలల కిందట వచ్చి భార్య, కుమారుడితో కలి సి మేడ్చల్ సమీప ఎల్లంపేట గ్రామంలో ఉంటున్నాడు. శుక్రవారం బీరా ప్రకాశ్ తదితరులు వర్గల్ మండలం శాకారంలోని శ్రీసాయి బిన్నీ మోడ్రన్ రైస్‌మిల్‌లో వడ్ల బస్తాలను లారీలో లోడ్ చేసేందుకొచ్చారు. లోడ్ చేస్తుండగా లారీ బస్తాల పైన ఉన్న బీరా ప్రకాశ్ ప్రమాదవశాత్తు కిందపడి గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు బీరా హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
మిరుదొడ్డి(దుబ్బాక: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కాసులాబాద్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి ఎస్‌ఐ బోయిని పరుశరామ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బిట్ల రాములు (75) వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. 2012లో భార్య చనిపోగా ముగ్గురు ఆడపిల్లల వివాహాలు చేశాడు. గురువారం సాయంత్రం రాములు వ్యవసాయ పొలం సమీపంలో చింత చెట్టు ఎక్కి కాయలు తెంపుతున్నాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి అన్న మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎర్రరాయి వాహనాలు సీజ్
న్యాల్‌కల్(జహీరాబాద్):అక్రమంగా ఎర్రరా యి తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్నట్లు హద్నూర్ ఎస్‌ఐ చల్లా రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలో న్యామతాబాద్, రేజింతల్, గణేశ్‌పూర్ గ్రామ శివారులోంచి లారీ, ట్రాక్టర్లలో ఎర్రరాయి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. హుస్సెళ్లి సరిహద్దు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఎర్రరాయిని తరలిస్తున్న లారీ, ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. రెండు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 15వ తేదీన గణేశ్‌పూర్ గ్రామ శివారులో ఒక వాహనాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే.
మూడు వారాలకే కాత