సంగారెడ్డి టౌన్ : మంజీరా గల్లంతైన యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ కథనం మేరకు.. అందోల్ మండలం కుమ్మరిగూడెంకు చెందిన మ్యాదరి నరేశ్ (30) కొద్దిరోజులుగా భార్య దుర్గతో కలిసి ఇస్నాపూర్‌లో డ్రైవింగ్ పనిచేస్తూ అద్దెకు నివాసం ఉంటున్నాడు. ఆదివారం తమ్ముడు నరేందర్, స్నేహితులతో కలిసి మంజీరా డ్యాంలో సరదాగా ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ నరేశ్ ఆవలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజులకు యువకుడి మృతదేహం దొరికింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.