
● కలెక్టర్‌లు, డాక్టర్ల వంటి ప్రముఖుల తాకిడి..
సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వెంకట్రామిరెడ్డి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి పూర్తి బాధ్యతలు స్వీకరించారు. వారిలో పెద్ద అమ్మాయి ఎంబీఏ వరకు చదివేలా సాయం అందించారు. అదేవిధంగా ఎమ్మెల్యే హరీశ్ రావు సతీమణి శ్రీనిత గంటల కొద్ది బాలసదనంలో ఉండి వారితో కలిసి భోజనం చేశారు. అదే విధంగా జిల్లా పోలీసు కమిషనర్‌గా పనిచేసిన జోయల్ డేవిస్ సతీమణి డాక్టర్ ప్రతిప పలుమార్లు సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా పోలీసు కమిషనర్‌గా పని చేసిన శ్వేత, గతంలో కలెక్టర్‌గా పనిచేసిన ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రస్తుత కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్‌లుగా పని చేస్తున్న చంద్రశేఖర్, ముమామ్మిల్ ఖాన్, గరిమా అగ్రవాల్‌లు పలుమార్లు బాలసదనం సందర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రస్తుత పోలీసు కమిషనర్ అనురాధ సైతం పిల్లల బాగోగులు చూస్తూ వారికి అవసరమైన బుక్స్, బట్టలు అందిస్తున్నారు. వీరితోపాటు పట్టణానికి చెందిన ప్రముఖ మహిళా వైద్యులు, మహిళా ప్రజాప్రతినిధులు ఎందరో బాలసదనం సందర్శించి పిల్లలతో పండుగలు జరుపుకున్నారు.