బీజేపీతోనే దేశ సమగ్రాభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ | - | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే దేశ సమగ్రాభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌

Mar 23 2024 8:05 AM | Updated on Mar 23 2024 1:44 PM

- - Sakshi

సదాశివపేట రూరల్‌ : మాట్లాడుతున్న రఘునందన్‌ రావు

సంగారెడ్డి: దేశ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆత్మకూర్‌ గ్రామంలో బూత్‌ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. మోదీ పాలనా దక్షతతో దేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి పులిమామిడి రాజు, నాయకులు మాణిక్‌ రావు, సంగమేశ్వర్‌, చిన్న పటేల్‌, విష్ణువర్థన్‌ రెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

మోదీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
దేశ ప్రజలకు ఉపయోగపడే పథకాలను పీఎం మోదీ అమలు చేస్తున్నారని, వీటిని గ్రామగ్రామాన వివరించాలని మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిన్నారంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జగన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రాజిరెడ్డిల పాల్గొన్నారు.

ఇవి చదవండి: కేసీఆర్‌ కీలక నిర్ణయంతో.. ఉత్కంఠకు తెర!

Advertisement
 
Advertisement
Advertisement