నేడు,రేపు మోకిలలో హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలం | - | Sakshi
Sakshi News home page

నేడు,రేపు మోకిలలో హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలం

Jun 29 2026 7:21 AM | Updated on Jun 29 2026 7:21 AM

నేడు,రేపు మోకిలలో హెచ్‌ఎండీఏ ప్లాట్ల వేలం విజయ సంకల్ప యాత్రకు ఆహ్వానం హామీలన్నీ అమలు చేయాలి స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

శంకర్‌పల్లి: మండల పరిధిలోని మోకిలలో హెచ్‌ఎండీఏ ప్లాట్లను రెండో విడత వేలం వేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం, మంగళవారాల్లో రెండురోజుల పాటు మొత్తంగా 100 ప్లాట్లను ఈ–వేలం ద్వారా విక్రయించనున్నారు. ప్లాట్‌ కనీస ధర రూ. 50వేలుగా అధికారులు నిర్ణయించారు. ఒక్కో ప్లాట్‌ కనీసం 300 గజాల నుంచి 500 గజాల విస్తీర్ణం కలిగి ఉందని, ఆసక్తి గలవారు రూ.5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌ చేసి, ఎంఎస్‌టీసీ ఈ–వేలం పోర్టల్‌ ద్వారా పాల్గొనాలని సూచించారు.

తుర్కయంజాల్‌: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆదిలాబాద్‌ నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ వరకు 101 కార్లతో నిర్వహించనున్న విజయ సంకల్ప యాత్ర ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఉద్యమకారుల ఫోరం నాయకులు రాష్ట్ర రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెనిగె విష్ణువర్ధన్‌, ఉపాధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కారింగుల నరేందర్‌ గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క జంగయ్యగౌడ్‌, ప్రచార కార్యదర్శి గోగికార్‌ కిషోర్‌ లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్య

తుర్కయంజాల్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్య డిమాండ్‌ చేశారు. ఆదిభట్ల సర్కిల్‌ పరిధి తుర్కయంజాల్‌లో ఆదివారం నిర్వహించిన భారత జాతీయ మహిళా సమాఖ్య మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ మేరకు రూ. 2,500 వెంటనే అమలు చేయకపోతే మహిళా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లా గౌరవ అధ్యక్షురాలు పోచమోని నీలమ్మ, ప్రధాన కార్యదర్శి ఎండీ పైమీద మాట్లాడుతూ.. సమాజంలో సగ భాగం ఉన్నప్పటికీ మహిళలు అణిచివేతకు గురువుతూనే ఉన్నారని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అన్ని పార్టీలు అమలు చేయాలని కోరారు. అనంతరం ఆదిభట్ల సర్కిల్‌ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా వట్టి విజయ, డి.రోజా, గౌరవ అధ్యక్షులుగా ఈదులకంటి అనురాధతో పాటు మరో 15 మందిని ఎన్నుకున్నారు.

శంషాబాద్‌ రూరల్‌: హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి, వికారాబాద్‌ జిల్లాల్లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల జూనియర్‌ కళాశాలల్లో బాలుర విభాగంలో మిగిలిన సీట్ల భర్తీ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ సమన్వయ అఽధికారి బి.రాజేశ్‌కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ, ఒకేషనల్‌ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లను ముందుగా హాజరైన విద్యార్థులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. జూలై 1న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం (మహేశ్వరం గేట్‌, బాయ్స్‌ స్కూలు)లో సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement