పోలియో నిర్మూలనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పోలియో నిర్మూలనే లక్ష్యం

Jun 29 2026 7:21 AM | Updated on Jun 29 2026 7:21 AM

మొయినాబాద్‌: పోలియో నిర్మూలనే లక్ష్యమని శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0–5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రెండు పోలియో చుక్కలతో చిన్నారులకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించవచ్చన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి భీంభరత్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోనియాదర్శన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ జంగయ్య, పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీష్‌, పీసీసీ సభ్యుడు షాబాద్‌ దర్శన్‌, పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యులు కంజర్ల భాస్కర్‌, కాలె శ్రీకాంత్‌, జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి, మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

వ్యాధిని తరిమికొడదాం

హుడాకాంప్లెక్స్‌: ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా పోలియో వ్యాధిని తరిమికొట్టొచ్చని అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. సరూర్‌నగర్‌ డివిజన్‌ నందనవనం బస్తీ దవాఖానాలో ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ పాపారావు, కందుకూరు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సత్యవతి, వైద్యాధికారి అర్చన, సుస్మిత, మానస, హెల్త్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారి శ్రీధర్‌, శ్రీనివాస్‌, పీహెచ్‌ఎన్‌ మల్లీశ్వరి, సూపర్‌వైజర్‌ ఇందిర, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

మండలి చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement