ఫాంహౌస్‌లపై పోలీసుల దాడి | - | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌లపై పోలీసుల దాడి

Jun 29 2026 7:21 AM | Updated on Jun 29 2026 7:21 AM

వడ్ల నందు మాట్లాడిన తీరు సరికాదు

15 లీటర్ల మద్యం స్వాధీనం

మొయినాబాద్‌: వీకెండ్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా మొయినాబాద్‌ పోలీసులు పలు ఫాంహౌస్‌లపై దాడులు నిర్వహించారు. సురంగల్‌, అమ్డాపూర్‌, కనకమామిడి గ్రామాల్లోని ఫాంహౌస్‌లలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సురంగల్‌లోని జెంటిల్‌ బ్రీజ్‌ ఫాంహౌస్‌, కనకమామిడిలోని వుడెన్‌ ఫాంహౌస్‌లో అనుమతి లేకుండా మద్యం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 15 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా మద్యం వినియోగిస్తున్నవారితోపాటు ఫాంహౌస్‌ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ.. అనుమతి లేకుండా మద్యం వినియోగించడం, సరఫరా చేయడం, నిల్వ ఉంచడం చట్ట విరుద్ధమని అన్నారు. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ప్రేమ విఫలమైందని..

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

మొయినాబాద్‌: ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నక్కలపల్లికి చెందిన కొడిచర్ల రమేష్‌ కుమారుడు అనిల్‌కుమార్‌ (24) చిన్నప్పటి నుంచి అజీజ్‌నగర్‌లో తన అమ్మమ్మవాళ్ల ఇంట్లో ఉంటున్నాడు. కొంత కాలంగా తన క్లాస్‌మేట్‌ అయిన యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇటీవల ఆమె అతనితో సరిగా మాట్లాడటం లేదు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకుడు అనంతయ్య

అనంతగిరి: ప్రొటోకాల్‌ విషయంలో ఇబ్బందులుంటే సంబంధిత శాఖ అధికారులకు కానీ, కలెక్టర్‌కు గాని ఫిర్యాదు చేయాలి.. కార్యక్రమం జరిగే ప్రదేశానికి వచ్చి నిరసన తెలపడం సరికాదని కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీజేపీ అసెంబ్లీ కోర్డినేటర్‌ వడ్ల నందు స్పీకర్‌పై మాట్లాడిన తీరు సరికాదన్నారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో స్పీకర్‌ రాజకీయాలు చేయరని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర నాయకుడు అనంతయ్య, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మల్లేశం, రామేశ్వర్‌, సురేందర్‌, సురేశ్‌, మురళి, యాదగిరి, బందయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement