షాద్‌నగర్‌రూరల్: విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి చెందిన సంఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని హజిపల్లి శివారులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని హాజిపల్లికి చెందిన కారుకొండరాజు పాడి ఆవులపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం పాడి వాటికి నీళ్లు తాగించేందుకు సమీపంలోని నీటి గుంత వద్దకు తీసుకెళ్లాడు. తిరిగి పశువుల పాకకు తీసుకువస్తున్న క్రమంలో ఒక ఆవుకు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తగిలి మృతి చెందింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పాడి ఆవు కళ్లముందే మృత్యువాత పడటంతో పాడి రైతు బోరున విలపించాడు. మృతి చెందిన పాడి ఆవు విలువ సుమారు రూ.60వేలు ఉంటుందని, నిరుపేద రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


