న్యూస్‌రీల్
గాలివాన.. హైరానా ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టం కలిగించింది. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి.
విచ్చలవిడిగా పర్మిట్ రూములు
● ఊరూరా జోరుగా బెల్ట్‌షాపులు
● పగలు రాత్రి తేడాలేకుండా మద్యం విక్రయాలు
● ఒక్కో బాటిల్‌కు అదనంగా వసూలు
● చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ అధికారులు
చేవెళ్ల: మండలంలోని 24 పంచాయతీలు, మున్సిపాలిటీలోని 11 వార్డుల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఆదాయం కోసం వైన్‌షాపుల యజమానులు గ్రామాలను పంచుకొని మద్యం సరఫరా చేస్తున్నారు. ఎకై ్సజ్‌శాఖ అధికారులు ఒక్కచోట కూడా తనిఖీ చేసి పట్టుకున్న దాఖలాలు లేవు. తమ బతుకులు బలైపోతున్నా బెల్టుషాపులు నిషేధించరా అంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కౌకుంట్లలో ఇటీవలే బెల్టుషాపుల నిషేధానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో బెల్టుషాపుల్లో మద్యం అమ్మితే రూ.లక్ష, కొన్నవారికి రూ.50 వేల జరిమానా విధించటంతోపాటు పట్టించిన వారికి రూ.10వేల బహుమతి ప్రకటిస్తూ తీర్మానం చేశారు.
మంచినీరు దొరకని ఊరంటూ ఉంటుందేమో కాని.. మద్యం దొరకని ఊరు లేదు. పట్టణ కేంద్రాల్లోనే కాదు జిల్లాలోని ఏ మారుమూల పల్లెలోకి తొంగిచూసినా మద్యం వాసన గుప్పుమంటోంది. వీధికో బెల్ట్‌షాపు దర్శనమిస్తోంది. ఉదయం, సాయంత్రం తేడా లేకుండా మద్యం వ్యాపారం మూడు క్వార్టర్లు.. ఆరు ఫుల్ బాటిళ్ల చందంగా జోరుగా సాగుతోంది.
– సాక్షి, రంగారెడ్డిజిల్లా
పల్లెల్లో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్టు దుకాణాలు మద్యం ప్రియులకు అడ్డాలుగా మారు తున్నాయి. వైన్‌షాపు నిర్వాహకులతో కుమ్మకై ్క అమ్మకాలు జరుపుతున్నారు. క్వార్టర్‌కు రూ.10 అదనం, బీర్‌కు రూ.20, అదే ఫుల్‌బాటిల్‌కు రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక వైన్‌షాపుల ముందు ఉదయం 11 నుంచి రాత్రి 12 గంటల వరకు రద్దీ కొనసాగుతూనే ఉంది. సరదాగా మొదలై.. తర్వాత అలవాటుగా మారుతోంది. మద్యం కోసం కొంతమంది అప్పులు చేస్తుండగా, మరికొంత మంది ఆస్తులు అమ్ముతున్నారు. తాగుడుకు డబ్బులు ఇవ్వడం లేదనే కారణంతో చివరకు తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యలను, పిల్లలను హత్య చేస్తున్న దాఖలాలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా..
ప్రతి దుకాణానికి 100 చదరపు మీటర్లలోపు పర్మిట్ రూం ఉండాలి. ప్యాకేజ్డ్ ఫుడ్డు మాత్రమే విక్రయించాలి. పర్మిట్ రూం వెలుపల మద్యం తాగడానికి వీల్లేదు. ఇందుకు విరుద్ధంగా కొన్ని దుకాణాలు వ్యవహరిస్తున్నాయి. చేపలు, చికెన్ ఫ్రై, బోటి, తలకాయ సూపు వంటి వాటిని కూడా ఇక్కడే వండివార్చుతున్నారు. సరైన పార్కింగ్ లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలిపి ఉంచి, ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్నారు. చీకటి పడిన తర్వాత రోడ్లపైనే మద్యం తాగుతూ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వాహనదారులతో వాగ్వాదానికి దిగుతున్నారు.


