బడంగ్‌పేట్‌లో అవినీతిని బహిర్గతం చేయాలి
ఖర్గే వ్యాఖ్యలు దేశద్రోహమే ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా చేపట్టారు.
మీర్‌పేట: కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మీర్‌పేటలోని క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకున్న అనుభవంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఒక రైతుగా ఆలోచించి రైతుకు కష్టం రాకూడదని నిరంతరం సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం నిధులివ్వకున్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని గుర్తుచేశారు. మూసీలో గోదావరి పారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్న రిజర్వాయర్ కూడా కాళేశ్వరంలో భాగమేనని పేర్కొన్నారు. కేసీఆర్‌పై నిందలు వేస్తూ రైతులకు నష్టం చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు అర్కల భూపాల్‌రెడ్డి, పెద్దబావి ఆనంద్‌రెడ్డి, దీప్‌లాల్ చౌహాన్, అనిల్‌యాదవ్, సునితబాలరాజు, రామిడి రాంరెడ్డి, అర్కల కామేశ్‌రెడ్డి, దోమలపల్లి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగం, అవినీతి, అక్రమాలకు బాధ్యులను చేస్తూ పదిమంది అధికారులను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఇక్కడ సాగిన వ్యవస్థీకృత అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించాలంటే లోతైన విచారణ జరిపించాలన్నారు. కేవలం కిందిస్థాయి అధికారులపైనే కాకుండా వారి వెనుక ఉండి అక్రమాలను ప్రోత్సహించిన అదృశ్య శక్తులపై కూడా కేసులు నమోదు చేయించాలి అంటూ లేఖలో పేర్కొన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి


