యాచారం: పంచాయతీల్లో రికార్డుల నమోదులో నిర్లక్ష్యం వద్దని, ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్కలుండాల్సిందేనని జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని తమ్మలోనిగూడ పంచాయతీని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పొరపాట్లను సరిచేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి అశోక్‌కు సూచించారు. సర్పంచులు అధికారులతో సమన్వయం చేసుకుంటే గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం ఈజీఎస్ నర్సరీని పరిశీలించి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు నీడ, తాగునీరు, ఓఆర్‌ఎస్ ఫ్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీలత, గ్రామ సర్పంచ్ దెంది రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్


