గాలివాన.. హైరానా | - | Sakshi
Sakshi News home page

గాలివాన.. హైరానా

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

విరిగిపడిన చెట్ల కొమ్మలు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

చల్లబడిన వాతావరణం

మొయినాబాద్‌, మొయినాబాద్‌ రూరల్‌: ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టం కలిగించింది. మొయినాబాద్‌ మున్సిపాలిలోని అజీజ్‌నగర్‌, ఎనికేపల్లి, హిమాయత్‌నగర్‌, చిలుకూరు, పెద్దమంగళారం, మొయినాబాద్‌, సురంగల్‌, ముర్తూజగూడ, అప్పోజీగూడ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం సుమారు అరగంటకు పైగా భారీ వర్షం పడింది. బలమైన ఈదురు గాలులకు అజీజ్‌నగర్‌, మొయినాబాద్‌ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై పడ్డాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలను తొలగించిన అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆకాశం మబ్బులుపడి దాదాపు గంటన్నర సేపు వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాల్లో వరద నీరు చేరింది. మండుతున్న ఎండలకు ఇబ్బంది పడుతున్న జనం చల్లని వానతో ఉపశమనం పొందారు.

Advertisement
 
Advertisement
Advertisement