దుద్యాల్: విద్యా సంవత్సరం ముగిసింది. నేటి నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిడంతో విద్యార్థులు వారివారి సొంతూర్లకు వెళ్లారు. ఈ విద్య సంవత్సరానికి సంబంధించి చిన్నారులు రాసిన పరీక్షల మూల్యాంకనం అనంతరం.. అందిన ప్రగతి నివేదిక ఆధారంగా.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రొగ్రెస్ రిపోర్టు కార్డులను వారి తల్లిదండ్రులకు అందజేసి, ప్రగతిని వివరించారు. కాగా.. మండల పరిధి చెట్టుపల్లితండా కస్తూర్బాగాంధీ బాలిక పాఠశాలలో బాలికలు తల్లిదండ్రులతో కలసి ఇంటికి వెళ్లారు. ఉపాధ్యాయులకు, తోటివారికి టాటా చెబుతూ.. మళ్లీ కలుద్దామంటూ ఇంటి బాట పట్టారు.
ధారూరులో..
ధారూరు: మండల పరిధి పాఠశాలల్లో పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను ప్రకటించి, ఉపాధ్యాయులు వారికి గురువారం ప్రొగ్రెస్ రిపోర్టులను అందజేశారు. గురుదొట్ల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సెలవుల నేపథ్యంలో చిన్నారులు తోటివారికి బైబై చెబుతూ.. సొంతూళ్ల బాట పట్టారు.


