నేడు ‘భూ భారతి’పై అవగాహన సదస్సు
మొయినాబాద్: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూ భారతి’పై గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ గౌతమ్‌కుమార్ తెలిపారు. సురంగల్ రోడ్డులోని స్టార్ కన్వెన్షన్ హాల్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. మొయినాబాద్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
నేడు డయల్ యువర్ డీఎం
ఇబ్రహీంపట్నం: ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టీసీ ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకటనర్సప్ప తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలపై గురువారం మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 4గంటల వరకు 7981745576 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని సూచించారు. మరింత మెరుగైన సేవల కోసం సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
రజతోత్సవాలను
జయప్రదం చేయండి
శంషాబాద్ రూరల్: వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవాలను జయప్రదం చేయాలని డీసీసీబీ డైరెక్టర్ బూర్కుంట సతీష్ పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మళ్లీ అఽఽధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలు అమలు చేయడంలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాల్లో పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి బీఆర్‌ఎస్ అధికారం చేపడుతుందని స్పష్టంచేశారు.
పీసీసీ అబ్జర్వర్ల నియామకం
సాక్షి, సిటీబ్యూరో: సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాలకు పీసీసీ అబ్జర్వర్ల (పరిశీలకులు)ను నియమించారు. ఈ మేరకు బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అబ్జర్వర్ల జాబితాను విడుదల చేశారు.
● హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలకు ఇద్దరేసి చొప్పున పీసీసీ అబ్జర్వర్లను నియమించగా, రంగారెడ్డి జిల్లాకు ముగ్గురు నేతలను నియమించారు.
● మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు పీసీసీ అబ్జర్వర్లుగా సీహెచ్.పారిజాతా నర్సింహారెడ్డి, కె.శివకుమార్‌లను నియమించగా, రంగారెడ్డి జిల్లాకు కె.శ్రీనివాస్‌రెడ్డి, కె.సంతోష్‌కుమార్, దారాసింగ్, వికారాబాద్‌కు ఎంఆర్‌జీ వినోద్ రెడ్డి, రాంశెట్టి నరేందర్‌లను నియమించారు.
● హైదరాబాద్ జిల్లాకు ఎస్.సురేష్‌కుమార్, పి.సుబ్రమణ్యప్రసాద్, సికింద్రాబాద్‌కు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, రాచమల్ల సిద్ధేశ్వర్, ఖైరతాబాద్‌కు ఎస్.వినోద్‌కుమార్, భీమగాని సౌజన్యగౌడ్‌లను పీసీసీ అబ్జర్వర్లుగా నియమించారు.
రేపు ద్విచక్ర
వాహనాలకు వేలం
తాండూరు: ఆబ్కారీ నేరాల్లో పట్టుబడిన రెండు స్ప్లెండర్ బైక్‌లకు ఈ నెల 25న వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ శాఖ తాండూరు సీఐ బాల గంగాధర్ బుధవారం ఓ ప్రకనటలో తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాండూరు ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో ఈ వేలం ఉంటుందని చెప్పారు.
బాలకేంద్రంలో
సమ్మర్ క్యాంపు
అనంతగిరి: వికారాబాద్‌లోని బాలకేంద్రంలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ అనురాధ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి మే 26 వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఈ క్యాంపు కొనసాగతుందని చెప్పారు. నృత్యం, వాయిద్యం, చిత్రలేఖనం, కుట్టు, అల్లికలు తదితర అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఉంటుందని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేడు ‘భూ భారతి’పై అవగాహన సదస్సు


