సన్న బియ్యం కేంద్రానివే
చేవెళ్ల: పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్న ఘనత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో రేషన్ లబ్ధిదారుడు చీర మహేందర్ ఇంట్లో శనివారం బీజేపీ నాయకులతో కలిసి సన్న బియ్యంతో వండిన భోజనం తిన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని తామే ఇస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎ.అనంత్‌రెడ్డి, యువ నాయకులు డాక్టర్ ఎం.వైభవ్‌రెడ్డి, బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు కమిటీ సభ్యుడు సామ మానిక్యరెడ్డి, నాయకులు ఆంజనేయులుగౌడ్, వెంకట్‌రెడ్డి, శర్వలింగం, జయశంకర్ తదితరులు ఉన్నారు.
అద్దంకి.. నోరు అదుపులో పెట్టుకో
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కేఎస్ రత్నం హెచ్చరించారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీనిఉద్దేశించి దయాకర్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు. మంత్రి పదవి కోసం.. దేశ ప్రధానిని విమర్శిస్తే దళితజాతి అంగీకరించబోదని తెలిపారు. ఎవరైనా స్థాయికి తగ్గట్లు మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కు తగదన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు.
● రాష్ట్ర ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే
● మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం


