అక్రమ నిర్మాణాల కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల కూల్చివేత

Apr 12 2025 8:53 AM | Updated on Apr 12 2025 8:53 AM

అక్రమ

అక్రమ నిర్మాణాల కూల్చివేత

పహాడీషరీఫ్‌: జల్‌పల్లి పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ‘సాక్షి’లో ఈ నెల 11న ‘శిఖం భూమిలో నిర్మాణాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి బాలాపూర్‌ మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తహసీల్దార్‌ ఇందిరా దేవి, ఆర్‌ఐ జమీల్‌తో కలిసి పోలీస్‌ బందోబస్తు నడుమ సర్వే నంబర్‌ 69లో 1000 గజాల విస్తీర్ణంలో వెలిసిన భారీ ప్రహరీని జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడు తూ.. దీంతో పాటు కుర్మల్‌గూడలోని సర్వే నంబర్‌ 80లో అక్రమంగా నిర్మించిన ఓ ప్రహరీ, సాగుకు మాత్రమే వినియోగించాల్సిన భూమిలో వెలసిన కట్టడాలను కూల్చివేశామని పేర్కొన్నారు. భూములు కబ్జాకు గురైతే.. పౌరులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత 1
1/1

అక్రమ నిర్మాణాల కూల్చివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement