సంప్రదాయానికి ప్రతీక ముగ్గులు
శంకర్‌పల్లి: భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మోకిలతండా పంచాయతీ ఆవరణలో సర్పంచ్ వర్త్య శాంతమ్మ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్ణేతగా విశ్రాంత ఐఏఎస్ పౌర్ణిమ వ్యవహరించి విజేతలను ప్రకటించారు. అనంతరం మొదటి విజేత సంధ్యకు రూ.50 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన ఉమకు రూ.25 వేలు, తృతీయ స్థానం సోనాలికి రూ.15 వేలు, 4వ స్థానం శివయ్య మాతకి రూ.10 వేలు, 5వ స్థానంలో నిలిచిన పార్వతికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అనంతరం సర్పంచ్ శాంతమ్మ పోటీల్లో పాల్గొన్న వారికి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు నాయక్, బాబు నాయక్, ప్రభాకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, రాములు, వాసుదేవ్ కన్నా తదితరులు పాల్గొన్నారు.
సంప్రదాయానికి ప్రతీక ముగ్గులు


