రిజర్వేషన్ టెన్షన్
సమీపిస్తున్న పురుపోరు
ఆమనగల్లు: పురపోరు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల నుంచి ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో తమకు రిజర్వేషన్లు అను కూలంగా వస్తాయా లేదో అనే టెన్షన్‌లో ఉన్నారు. వార్డులు, చైర్మన్ పదవులకు రిజర్వేషన్‌లు మారుతాయనే చర్చలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ ఏమొచ్చినా అందుకు తగిన విధంగా ఆయా పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎలాగైనా పోటీలో ఉండాల్సిందే అని నిర్ణయించుకున్నవారు అందుకు తగి న ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వచ్చే అవకా శం ఉందంటూ ఆశావహులు లెక్కలు వేసుకుంటూ రిజర్వేషన్లపై ఓ అంచనాకు వస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
తుది జాబితాల విడుదల
ఆమనగల్లు మున్సిపాలిటీలో ఓటర్ల తుది జాబితాను మున్సిపల్ కమిషనర్, సహాయ ఎన్నికల అధికారి శంకర్ విడుదల చేశారు. ఓటర్ల జాబితాను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం తుది ఓటరు జాబితాను, పోలింగ్ స్టేషన్‌ల తుది జాబితాను సైతం ప్రకటించారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో మొత్తం 16,984 మంది ఓటర్లు ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలవగా రిజర్వేషన్లపై నేటికీ స్పష్టత రాలేదు. దీంతో ఆశావహులు తమనకు అనుకూలంగా వస్తాయా లేదా అని అయోమయోనికి గురవుతున్నారు.


