కిరాణా షాపులపై దాడులు
కొందుర్గు: విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కిరాణ దుకాణాలపై దాడులు చేసి నిషేధిత గుట్కా, అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రోడ్డుపై వాహనాల తనిఖీ నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను పట్టుకున్నారు. షాద్‌నగర్ రూరల్ సీఐ నర్సయ్య మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొందుర్గులో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించామని, ఇందులో భాగంగా 20 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు సీజ్ చేశామన్నారు. అదేవిధంగా అనుమతి లేకుండా కిరాణ షాపుల్లో విక్రయిస్తున్న మద్యం బాటిళ్లు, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామని వివరించారు. కార్యక్రమంలో ఎస్సై రవీందర్ నాయక్‌తోపాటు దాదాపు 50 మంది పోలీసులు దాడుల్లో పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
కేశంపేట: ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు నింబధనలు పాటించాలని సీఐ నరహరి అన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా మండల పరిధిలోని అల్వాల, కొత్తపేట, కేశంపేట గ్రామాల్లో వాహనాల తనిఖీలు, కిరాణ షాపుల్లో చెక్కింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
గుట్కా, మద్యం బాటిళ్ల్లు స్వాధీనం


