అబ్దుల్లాపూర్‌మెట్: కోహెడలో నిర్మించబోయే అంతర్జాతీయ సమీకృత మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన పరిపాలన అనుమతులు వేగవంతం చేయడంతో పాటు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించినట్లు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. దేశంలోనే ఆదర్శవంతంగా కోహెడ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎస్ శాంతకుమారి, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావు, సీఎం ఓఎస్‌డీ చంద్రశే ఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి


