పెళ్లికి వెళ్లిన వాచ్‌మెన్ అదృశ్యం
మీర్‌పేట: స్నేహితుడి పెళ్లికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వినాయకనగర్‌కు చెందిన ముక్కల మోసెస్(32) వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 5న ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో స్నేహితుడి వివాహానికి వెళ్తున్నానని భార్య ఉషారాణికి చెప్పి బయలుదేరాడు. తిరిగి రాకపోవడంతో భార్య ఆయన బంధుమిత్రుల వద్ద వాకబు చేసింది. ఆచూకీ తెలియకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
సికింద్రాబాద్: మానసికస్థితి సరిగాలేని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు .. మేడ్చల్‌లోని సుచిత్రకు చెందిన నరేష్(38)కు మానసిక స్థితి సరిగా లేదు. ఈ నెల 15న రాత్రి సమయంలో డబీర్‌పుర రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాంధీ హాస్పిటల్‌లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
పెళ్లికి వెళ్లిన వాచ్‌మెన్ అదృశ్యం


