
● ప్రత్యామ్నాయ చర్యలు
కొత్తూరు: మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉన్నాయి. 6,200 మిషన్ భగీరథ కుళాయిలు ఉన్నాయి. వేసవిలో నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీటి ఎద్దడి ఏర్పడితే ఇప్పటికే మరమ్మతులు చేసిన 22 బోరుబావుల ద్వారా సరఫరా చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతానికి అన్ని వార్డుల్లో నీటి సరఫరా సక్రమంగా ఉందని, ఎక్కడా పైపులైన్ల మరమ్మతులు కూడా లేవని తెలిపారు. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.