
● లీకేజీలు.. మరమ్మతులు
చేవెళ్ల: మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లా కనెక్షన్లతో నీటి సమస్య కొంత మేరకు తీరినా పైపులైన్ల లీకేజీలు, మరమ్మతుల కారణంగా అక్కడక్కడా సమస్యలు ఎదురవుతున్నాయి. మున్సిపల్ పరిధిలో 19 వేల జనాభా ఉంది. పలు కాలనీల్లో పైపులైన్ లీకేజీల కారణంగా చేపడుతున్న మరమ్మతులతో స్థానికులు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో మరమ్మతులతో వారంరోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు అధికారులు మరమ్మతులు పూర్తి చేసి పునరుద్ధరించారు. మున్సిపల్ పరిధిలోని ఊరేళ్లలో నీటి సమస్య ఏర్పడడంతో చర్యలకు ఉపక్రమించారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలతోపాటు అప్రమత్తంగా ఉన్నట్లు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 35 లక్షల లీటర్ల ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు. ఇప్పటికే సమస్యలున్న ప్రాంతాలను గుర్తించామని, ఎక్కువ ఇబ్బంది వస్తే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.