
కొత్త కాలనీల్లో సమస్యలు
కొత్తూరు: మున్సిపాలిటీలో ప్రస్తుతం 12 వార్డులు, సుమారు 20 వేల మంది జనాభా ఉన్నారు. కొత్తగా విస్తరించిన వింటేజ్, శ్రీరామ్‌నగర్, తిరుమల కాలనీల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేవు. నిత్యం మున్సిపాలిటీలో 35 మంది సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, హోటళ్ల నుంచి సేకరించి చెత్తను నాలుగు ట్రాక్టర్లు, మూడు ఆటోల్లో పారిశ్రామికవాడ సమీపంలో ఉన్న డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. ప్రస్తుతానికి మున్సిపాలిటీలో 42 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉంది.