
తుక్కుగూడలో ప్రచారం చేస్తున్న రామచంద్రయ్య యాదవ్
తుక్కుగూడ: రాష్ట్రంలో మార్పు కోసమే భారత చైతన్య పార్టీ (బీసీవై) పోటీ చేస్తుందని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు బి.రామచంద్రయ్య యాదవ్ అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి కుంభం సురేశ్ యాదవ్‌కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నుంచి సబితారెడ్డి భూకజ్జాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. ప్రజలు చెరుకు రైతు గుర్తు పై తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అభ్యర్థి కుంభం సురేశ్ యాదవ్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్రయ్య యాదవ్